టేబుల్ కింద అలవాట్లు నాకు లేవు.. జగన్ అలా చేశారేమో..?: సీఎంSaturday, May 19, 2012 07:26
సాక్షి ఆస్తుల అటాచ్ మెంట్ కు సంబంధించి సాక్షి పత్రికలో తాను టేబుల్ కింద సంతకం పెడుతున్నట్లు కార్టూన్ వేయడంపై ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. సీబీఐ అడిగినపుడు ప్రతి ప్రభుత్వం ఇలాంటి జీవోలను విడుదల చేస్తుందని తెలిపారు. గతంలో సత్యం రామలింగరాజు కేసు సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డిగారు కూడా ఇదే జీవోపై సంతకం చేశారనీ, అప్పుడు మీ తండ్రిగారు కూడా ఇలాగే టేబుల్ కింద కూర్చుని సంతకం చేశారా..? అని ప్రశ్నించారు.
భూ కేటాయింపులన్నీ చట్టపరంగానే చేశాం: పొన్నాల వివరణSaturday, May 19, 2012 05:27
మంత్రులను సీబీఐ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య తనదైన శైలిలో స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో జీఓలు, భూకేటాయింపులు అన్నీ చట్టపరంగానే చేశామన్నారు. అత్యున్నత న్యాయస్థానం తనపై చేసిన అభియోగానికి ఇప్పటికే రాతపూర్వక సమాధానం ఇచ్చానని, ఇక సీబీఐ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తానని పొన్నాల శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
జగన్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు: లగడపాటి జోస్యంSaturday, May 19, 2012 03:56
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒక సీటూ కూడా గెలవదని లగడపాటి జోస్యం చెప్పారు. అలాగే సీఎం పదవి కోసం పార్టీని వీడిన జగన్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని లగడపాటి అన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా జగన్‌కు వ్యతిరేకిస్తాయని, కడప మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు లగడపాటి వెల్లడించారు.
చిరంజీవి సామాజిక న్యాయం ఎవరికి చేశారు!?: చంద్రబాబుSaturday, May 19, 2012 02:52
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సామాజిక న్యాయం ఎవరికి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సామాజిక న్యాయమంటూ పార్టీ పెట్టి.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన చిరంజీవి సామాజిక న్యాయం ఎవరికి చేశారని అడిగారు. 30 ఏళ్లు సామాజిక సేవ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చంద్రబాబు శనివారం వ్యాఖ్యానించారు.
వియ్యంకుడి ఇంట్లో దొరికిన రూ.35కోట్లు చిరంజీవివే: బాబుSaturday, May 19, 2012 01:47
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో దొరికిన రూ. 35 కోట్లు చిరంజీవివేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఆరోపించారు. అవినీతిపరులు, చేతకాని పాలకుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అసమర్థ కాంగ్రెస్ పాలన, వైఎస్ కుటుంబ అవినీతితో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
రాష్ట్రం మొత్తానికి నువ్వు సీఎం ఎలా అవుతావ్!?: కేసీఆర్ ప్రశ్నSaturday, May 19, 2012 01:56
తెలంగాణ ఉద్యమంపై పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు తాజాగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తున్న కేసీఆర్ తెలంగాణ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులకు నీటి విడుదల జరుగుతున్న అన్యాయంపై పోరుబాట పట్టనున్నట్లు ప్రకటించారు. పనిలో పనిగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. "నువ్వు రాష్ట్రం మొత్తానికి సీఎం ఎలా అవుతావ్ ?'' అని కేసీఆర్ ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులో సమైక్య రాష్ట్రంలోని తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు.
లగడపాటి సోదరుడిని జైల్లో పెట్టే దమ్ముందా!?: జగన్ ప్రశ్నSaturday, May 19, 2012 03:57
కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోదరుడు తన మీడియాలో పెట్టుబడులు పెట్టారని, ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టే ధైర్యం ఉందా అని సీబీఐని, కాంగ్రెస్ పెద్దలను, తెదేపా చీఫ్ చంద్రబాబును ప్రశ్నిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.
జగన్ పత్రిక నిండా ఎల్లో కలర్ కనిపిస్తుంది: మధుయాష్కీFriday, May 18, 2012 23:46
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పత్రిక నిండా ఎల్లో కలర్ కనిపిస్తుందని కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ఆరోపించారు. తెలంగాణ వనరులను దోచుకుని పత్రిక, టీవీ చానల్‌ను పెట్టిన జగన్‌కు ప్రాంత నేతలు మద్దతు తెలపడం ఏమిటని మధుయాష్కీ ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు చేస్తే సానుభూతి రాదని, అలాంటివారు గెలిచి అధికారంలోకి వస్తే అరాచకం నెలకొంటుందని యాష్కీ అన్నారు
మంత్రుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. సబితను ప్రశ్నించిన సీబీఐFriday, May 18, 2012 06:55
అనుకున్నట్లే జరుగుతోంది. జగన్ ఆస్తుల కేసు మెల్లిమెల్లిగా వైఎస్సార్ హయాంలో పనిచేసిన కేబినెట్ మంత్రుల మెడకు చుట్టుకుంటున్నట్లు కనబడుతోంది. ఎవరైతే భారీ కేటాయింపులు, అనుమతులు ఇచ్చారో వారిని ఏ క్షణమైనా సీబీఐ ప్రశ్నిస్తోంది. తాజాగా హోంమంత్రిని సబితా ఇంద్రారెడ్డిని గుట్టుచప్పుడు కాకుండా నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది.
నెల్లూరు అభివృద్ధి చెందాలంటే టిఎస్సార్‌ను గెలిపించండి: చిరుFriday, May 18, 2012 05:28
సొంత జిల్లాకు సేవచేయాలనుకుంటున్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థి టి.సుబ్బిరామి రెడ్డికి ఓటేయండని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కోరారు. ఎంపీగా విశాఖను ఎలా అభివృద్ధి చేశారో, అదేవిధంగా సొంత జిల్లా నెల్లూరును అభివృద్ధి చేస్తారని చిరు చెప్పారు. టిఎస్సార్ నెల్లూరుకు ఎంతో చేయాలని అనుకుంటున్నారని, అందుకు మీరు చేయాల్సింది ఒక్కటేనని, అదే కాంగ్రెసు పార్టీకి ఓటు వేయడమని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.